తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..

Araku Supplied 2 Thousand Kilograms Turmeric to Tirumala Tirupati | TTD Latest News
x

తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..

Highlights

TTD: స్వచ్ఛత, నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన టీటీడీ పసుపు నాణ్యతపై టీడీపీ సంతృప్తి...

TTD: తిరుమల శ్రీవారికి ఇకపై అరుకు లోయలో గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన తేనె, పసుపుతో పూజాది కైంకర్యాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తేనె, పసుపు సరఫరా నిమిత్తం రాష్ట్ర గిరిజనుల సహకార సంస్థకు టీటీడీ ఆర్డర్ చేసింది. గో అధారిత వ్యవసాయం ద్వారా సేకరించే అహార ధన్యాలతో వెంకటేశ్వర స్వామి వారికి అన్నప్రసాదాలు తయారుచేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్న టీటీడీ ఇదివరకే స్వామివారి అభిషేకానికి అరకు లోయ ప్రాంతంలో దొరికే తేనెను వినియోగిస్తుంది.

రాష్ట్ర గిరిజనులు సహకార సంస్థ విజ్ఞప్తి మేరకు విశాఖ మన్యం ప్రాంతంలో లభ్యమయ్యే స్వచ్ఛమైన పసుపుని వెంకటేశ్వరస్వామి వారి పూజలలో ఉపయోగించిలని టీటీడీ నిర్ణయించింది. మొదటి విడతగా 2 వేల కేజిల స్వచ్ఛమైన పసుపుని తెప్పించిన టీటీడీ.. స్వచ్ఛత, నాణ్యత ప్రమాణాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.

రెండవ విడతగా గిరిజన సహకార సంస్థ ద్వారా 5 వేల కేజిల పసుపు కొనుగోలుకు చేసింది. జీసీసీ ఛైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి ఇటీవల టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఇక్కడి సరకు కొనుగోలు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. జీసీసీ మార్కెటింగ్‌ సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని శోభారాణి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories