రేషన్ పంపిణీ ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. వాహనాలపై ఫోటోలు, పార్టీ గుర్తులు వద్దు: హైకోర్టు

రేషన్ పంపిణీ ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. వాహనాలపై ఫోటోలు, పార్టీ గుర్తులు వద్దు: హైకోర్టు
x
Highlights

ఫిబ్రవరి 1నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ...

ఫిబ్రవరి 1నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ పథకంపై ప్రారంభంపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.

అయితే రేషన్‌ సరుకులు అందించే వాహనాలపై రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉండరాదని ధర్మాసనం స్ఫష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఆదివారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం పూర్తి వివరాలతో రెండు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)ను సంప్రదించాలని తెలిపింది.

ఇక దీనిపై ఎస్‌ఈసీ 5 రోజుల్లో స్ఫస్టమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా సంక్షేమ పథకాలను సొంత డబ్బులతో ఎవరూ చేయరని.. ప్రజలు కట్టే పన్ను డబ్బుతోనే పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజల కోసం సంబంధించిన పథకం కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories