ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు

AP High Court Decision About The ZPTC and MPTC Elections Today 16 09 2021
x

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ నీలం *నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్ ఉందని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు

Andhra Pradesh: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. స్థానిక ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ధర్మాసనం ముందు ఎస్‌ఈసీ తన వాదనలు వినిపించింది. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాలి. కానీ పోలింగ్‌ తేదీకి 4వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు తీర్పుతో పూర్తి క్లారిటీ రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories