ఏపీ ప్రజలకి సీఎం జగన్ పిలుపు.. ఈరోజు రాత్రి ఏడూ గంటలకు..

ఏపీ ప్రజలకి సీఎం జగన్ పిలుపు.. ఈరోజు రాత్రి ఏడూ గంటలకు..
x

Ys Jagan Mohan reddy

Highlights

CM YS Jagan Request : గత ఏడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలకు శ్రీకారం చుట్టింది.

CM YS Jagan Request : గత ఏడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇది ఏర్పాటు అయి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం జగన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి లంచాలు తావులేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్లు, ఉద్యోగుల సేవలకి గాను ఈ రోజు ( శుక్రవారం) సాయంత్రం ఏడు గంటలకు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ఏపీ ప్రజలకు సీఎం రిక్వెస్ట్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. గాంధీ జయంతి సందర్భంగా గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ఆ తరవాత వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్ని అభినందించారు.

కేవలం పోడు వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్న గిరిజన రైతులకి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామా స్వరాజ్యం తీసుకుకువచ్చామని అన్నారు. ప్రతి గిరిజన పేదకూ రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. 1.53 లక్షల మంది గిరిజనులకి 3.12 లక్షల ఎకరాల పై హక్కులు కల్పించారు. ఎలాంటి వివాదాలు లేకుండా అటవీ భూముల సర్వే డిజిటలైజేషన్ చేశారు. పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories