Chevireddy Bhaskar Reddy: కరోనా పేషెంట్లకు చెవిరెడ్డి పరామర్శ

Chevireddy Bhaskar Reddy: కరోనా పేషెంట్లకు చెవిరెడ్డి పరామర్శ
x
Chevireddy Bhaskar Reddy Visits Covid hospitals
Highlights

Chevireddy Bhaskar Reddy: కరోనా ఆస్పత్రుల్లో సేవలు సక్రమంగా అందలేదనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది.

Chevireddy Bhaskar Reddy: కరోనా ఆస్పత్రుల్లో సేవలు సక్రమంగా అందలేదనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. తక్షణమే వీలైనన్ని ఆస్పత్రులను అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించే విధంగా ఏపీ సీఎం ఆదేశాలు జారీచేశారు. దీనిపై నాలుగు రోజుల క్రితం విశాఖ జిల్లాలోని విమ్స్ ఆస్పత్రిని అక్కడ మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అదేవిధంగా బుధవారం ఉదయం నెల్లూరులోని కోవిద్ ఆస్పత్రి రోగులతో జూమ్ ద్వారా వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడి, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరో్ అడుగు ముందుకేసి తనే పీపీఈ కిట్లు ధరించి, తిరుపతి లోని ఎస్వీయూ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులను సేవల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ప్రభుత్వాలుపత్రుల్లో సేవలు మరింత పారదర్శకంగా జరిగితే కోవిద్ నుంచి మరింత మంది కోలుకుని, మరణాల రేటు తగ్గించేందుకు వీలుంటుందని పలువురు అంటున్నారు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రతిరోజు కోవిడ్‌ ఆస్పత్రుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతిలో కోవిడ్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి స్విమ్స్‌లోని స్టేట్ కోవిడ్ఆ స్పత్రిని స్వయంగా సందర్శించారు.

పీపీఈ కిట్ ధరించి 330 మంది పేషెంట్లను స్వయంగా కలిసి వారితో మాట్లాడారు. ప్రతి పేషెంట్‌ వద్దకు వెళ్లి వాళ్లకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి తెలుసుకొన్నారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించి అక్కడి వైద్య సేవల గురించి తెలుసుకొంటున్నట్లు తెలిపారు. స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని అలాగే సౌకర్యాలు కూడా బాగున్నాయని అన్నారు. అలాగే లోపాలు ఉంటే సరి చేయడమే తమ లక్ష్యమని, కోవిడ్‌ ఆస్పత్రుల మీద 45రోజులుగా తిరుపతిలో సమన్వయ కమిటీ పని చేస్తోందన్నారు. అధికారులతో కలిసి రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని, ఎక్కడా లోపం ఉండకూడదన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories