పార్టీ మార్పుపై స్పందించిన మంత్రి అఖిల ప్రియ

పార్టీ మార్పుపై స్పందించిన మంత్రి అఖిల ప్రియ
x
Highlights

గతవారం రోజులుగా మంత్రి అఖిల ప్రియ, ఆమె సోదరుడు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి లు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వార్తలపై...

గతవారం రోజులుగా మంత్రి అఖిల ప్రియ, ఆమె సోదరుడు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి లు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వార్తలపై అఖిల ప్రియ స్పందించారు. తల్లితండ్రి లేని తనకు చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి తండ్రిలాగ కాపాడారని. అలాంటి మంచి మనిషిని… టీడీపీ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని అఖిల ప్రియ చెప్పారు. భూమా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని.. ఈ రూమర్లు తనను బాధించాయని అన్నారు.

ఇదిలావుంటే మంత్రి అఖిల ప్రియ, ఆమె తోపాటు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తమ గన్ మెన్లను వెనక్కి పంపించారు. దాంతో ఆమె జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తమకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు కావాలని అఖిలప్రియ పట్టుబడుతున్నారు. అయితే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. నంద్యాల నుంచి తన అల్లుడు పోటీ చేస్తాడని వెల్లడించాడు. దాంతో వివాదం రాజుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories