Andhra Pradesh: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏసీబీ అధికారుల సోదాలు

ACB officials Ride in Vijayawada Temple
x

విజయవాడ దేవస్థానం (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Andhra Pradesh: టెండర్ల ప్రక్రియలో వస్తున్న అనేక ఆరోపణలు * చీరల కౌంటర్లు, టికెట్ల కౌంటర్లు, పరిపాలన విభాగంలో సోదాలు

Andhra Pradesh: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లు, టిక్కెట్ల కౌంటర్స్, పరిపాలన విభాగం, స్టోర్స్ ఇలా ఏ ఒక్క విభాగాన్ని వదిలిపెట్టకుండా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి క్షుణ్ణంగా రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఒక్కో టీంలో విజిలెన్స్ అధికారులు, ఫుడ్ కంట్రోల్ బోర్డు సిబ్బంది ఉన్నారు. ఈ తనిఖీల్లో అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏసీబీ అధికారులు వచ్చిన సమయంలో ఈవో సురేష్ బాబు అందుబాటులో లేరు టెండర్ల ప్రక్రియలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories