అమలాపురం ఘటనపై ఏడు కేసులు నమోదు, 46 మందిన అరెస్ట్ - ఏపీ డీజీపీ

7 Cases Filed on Amalapuram Incident and 46 Members Arrested Said AP DGP | Live News
x

అమలాపురం ఘటనపై ఏడు కేసులు నమోదు, 46 మందిన అరెస్ట్ - ఏపీ డీజీపీ

Highlights

Amalapuram - AP DGP: మరో 72 మంది అరెస్ట్‌కు బృందాలు ఏర్పాటు చేశాం...

Amalapuram - AP DGP: అమలాపురం ఘటనపై ఏడు కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ రెండు ఇల్లుల దహనం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు, మూడు బస్సుల దగ్దంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని మరో 72 మంది అరెస్ట్‌కు బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లందరిని అదుపులోకి తీసుకున్నామని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వివరించారు.

అదనపు బలగాల మోహరించామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదన్నారు. నిన్నటి ఘటన అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సప్ గ్రూప్‌ల‌లో తప్పుడు ప్రచారం ద్వారా గుమిగూడారని తెలిపారు. ఇక అమలాపురంలో ఇంటర్నెట్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించామని, 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. గ్రూప్స్‌గా తిరిగితే సహించేది లేదని ఏపీ డీజీపీ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories